Bhagavadgita


 అర్జునవిషాద యోగము

1. !!  ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . .!!

వివరణ  :-

ధృతరాష్ట్రుడు పలికెను.

ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?


2. !! దృష్ట్వా తు పాణ్డవానీకం   !!

వివరణ  :-

సంజయుడు పలికెను:

అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను.


3. !!  పశ్యైతాం పాణ్డుపుత్రాణాం   !!

వివరణ  :-

ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.


For more 

http://www.msktutorials.com/bhagavadgitaarjunavishadayogam.html


Comments